News March 10, 2025

అనకాపల్లి జిల్లాకు చేరిన పది పరీక్షల ప్రశ్నాపత్రాలు

image

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలు ఆదివారం అనకాపల్లి పోలీసు స్టేషన్‌కు చేరాయి. సంబంధిత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీటిని పరిశీలించిన అనంతరం స్టేషన్‌లోనే భద్రపరిచారు. ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఆయా రోజుల్లో పరీక్ష ప్రారంభం కావడానికి కొద్దిసమయం ముందు ప్రశ్నాపత్రాలను పోలీసు స్టేషన్‌ నుంచి పరీక్షా కేంద్రాలకు తరలిస్తారు.

Similar News

News March 14, 2026

నెల్లూరులో పలు హోటల్స్ తనిఖీ.. 92 సిలిండర్లు సీజ్

image

జిల్లాలోని పలు హోటళ్లు, దుకాణాలు, బార్ & రెస్టారెంట్లు, గ్యాస్ రీఫిల్లింగ్ యూనిట్ల వద్ద విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లలో వాడే సిలిండర్లను అక్రమంగా హోటల్స్‌లో వాడుతున్నట్లు గుర్తించారు. భారత్ గ్యాస్ 21 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 17 ఖాళీ సిలిండర్లు, ఇండేన్ – 03 నిండిన సిలిండర్లు, మొత్తం 92 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశారు.

News March 14, 2026

భట్టి ఇంటికి సీఎం చంద్రబాబు

image

ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. ఇటీవల భట్టి కుమారుడి వివాహం జరగగా బిజీ షెడ్యూల్ వల్ల చంద్రబాబు హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం ప్రజాభవన్‌కు వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం చంద్రబాబు అల్లు అరవింద్ నివాసానికి చేరుకొని శిరీష్-నయనిక దంపతులకు విషెస్ తెలిపారు. ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.

News March 14, 2026

కర్నూలులో ఈనెల 16న గ్రీవెన్స్: కలెక్టర్

image

ఈ నెల 16న (సోమవారం) కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టంనిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. అదేరోజు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాలు, రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులు సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.