News March 10, 2025
గుంటూరు: వరల్డ్ నంబర్ 1 ర్యాంకింగ్ మనోడికే.!

గుంటూరుకు చెందిన అరిగెల భార్గవ్ బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు. తాజాగా జూనియర్ వరల్డ్ ర్యాంకింగ్స్ డబుల్స్ విభాగంలో ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరుకు చెందిన గొబ్బూరి విశ్వతేజతో కలిసి వరల్డ్ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు భార్గవ్‌ను అభినందిస్తున్నారు.
Similar News
News April 15, 2026
టీడీపీ రాష్ట్ర కమిటీలో గుంటూరు నేతలకు ప్రాధాన్యం

టీడీపీ రాష్ట్ర, జాతీయ కమిటీలను అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కమిటీల్లో గుంటూరు జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. గుంటూరు పశ్చిమ నుంచి పిడుగురాళ్ల మాధవిని పొలిట్ బ్యూరోగా నియమించారు. తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం రామకృష్ణ, కల్పటపు బుచ్చి రాంప్రసాద్, వీఆర్ శ్రీలక్ష్మిలకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవులు ఇచ్చారు. దాసరి ఉదయశ్రీ యాదవ్, తాడిశెట్టి మురళి సహా పలువురికి రాష్ట్ర స్థాయి కమిటీల్లో చోటు కల్పించారు.

ఇంటర్ ఫలితాల్లో సత్తా గుంటూరు జిల్లా స్టూడెంట్స్

<<19653702>>ఇంటర్ ఫలితాల్లో<<>> గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 33,643 మందికి 29,530 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 30,551 మంది పరీక్షలు రాయగా 26,856 మంది పాసయ్యారు. 88 శాతం పాస్ పర్సంటేజీతో గుంటూరు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచింది.