News March 10, 2025
Stock Markets: దూకుడు కంటిన్యూ..

స్టాక్‌మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. నిఫ్టీ 22,654 (102), సెన్సెక్స్ 74,653 (313) వద్ద ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందినా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. CPSE, PSE, కమోడిటీస్, మెటల్స్, మీడియా, ఎనర్జీ, రియాల్టి, FMCG, ఇన్ఫ్రా, ఫైనాన్స్, చమురు షేర్లు ఎగిశాయి. ఆటో, వినియోగ, హెల్త్‌కేర్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. పవర్ గ్రిడ్ టాప్ గెయినర్.
Similar News
News March 10, 2025
బెస్ట్ ఫీల్డర్ ఇతనే.. జాంటీ రోడ్స్ రిప్లై!

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్ ఎవరనే ప్రశ్నే వస్తే అందరూ దక్షిణాఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్ పేరు చెప్తుంటారు. అలాంటి ఫీల్డర్‌ను సైతం NZ ప్లేయర్ ఫిలిప్స్ మెప్పించారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గిల్ కొట్టిన బంతిని ఫిలిప్స్ పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తీరు అద్భుతం అని, ఈ జనరేషన్‌లో బెస్ట్ ఫీల్డర్ ఇతనేనంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. తానూ అంగీకరిస్తున్నానని జాంటీ రోడ్స్ రిప్లై ఇచ్చారు.
News March 10, 2025
సందర్భం వస్తే ఆమరణ దీక్ష చేస్తా: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో చేపట్టిన కులగణనను దేశవ్యాప్తంగా ఫాలో అవుతున్నారని CM రేవంత్ తెలిపారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం 99సార్లయినా ఢిల్లీ వెళ్తా. నా ఢిల్లీ పర్యటనల వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై పోరాడతాం. తెలంగాణ కేంద్రానికి కడుతున్న పన్నుల మొత్తం ఎంత? రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని?సందర్భం వస్తే ఈ అన్యాయంపై ఆమరణ దీక్ష చేస్తా’ అని పేర్కొన్నారు.
News March 10, 2025
నామినేషన్ వేశాక సీఎంను కలిసిన వీర్రాజు

AP: MLA కోటాలో MLC అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ నేత సోము వీర్రాజు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీర్రాజును సీఎం చంద్రబాబు అభినందించారు.