News March 10, 2025
పిఠాపురం: వర్మకు MLC ఇచ్చేది అప్పుడేనా?

పిఠాపురం మాజీ MLA వర్మకు TDP అధిష్ఠానం మళ్లీ నిరాశే మిగిల్చింది. 2014లో ఇండిపెండెంట్‌గా గెలిచి TDPలో చేరిన ఆయన గత ఎన్నికల్లో పవన్ కోసం టికెట్ త్యాగం చేశారు. దీంతో ఈసారి ఎలాగైనా MLC పదవి వస్తుందనుకుంటే నిరాశే మిగిలింది. ఆయన అభిమానులు హైకమాండ్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2027లో 7ఎమ్మెల్సీ స్థానాలకు ఖాళీ ఏర్పడుతుండటంతో అప్పడు అవకాశం ఇస్తామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News March 6, 2026
కర్ణాటకలో మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు మైనర్లకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్లు సీఎం సిద్దరామయ్య అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రకటించారు. పిల్లలు, టీనేజర్లపై SM దుష్ప్రభావం చూపుతుందనే కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో మైనర్లకు SMపై నిషేధం ఉండగా ఫిన్‌ల్యాండ్, UK కూడా అమలుకు కసరత్తు చేస్తున్నాయని KA ఐటీ మినిస్టర్ ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
News March 6, 2026
వేములవాడ: వైభవంగా రాజన్న దివ్య కళ్యాణం

వేములవాడ పుణ్యక్షేత్రంలో పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. శివార్చన వేదికపై ఆలయ స్థానాచార్యులు నమిలికొండ ఉమేశ్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఈ వేడుకను నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం భక్తులు దర్శించుకొని పులకించిపోయారు.
News March 6, 2026
కమ్మర్‌పల్లి ప్రాంతంలో పులి సంచారం

మహారాష్ట్రలోని తాడోబా నుంచి నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన పెద్ద పులి ప్రస్తుతం కమ్మర్‌పల్లి రేంజ్ పరిధిలోని గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో సంచరిస్తోంది. మూడు రోజుల క్రితం కమ్మర్పల్లి రేంజ్లోకి వచ్చిన ఈ పులి ఇదేచోట వన్యప్రాణిని చంపి తిని, ఇక్కడే దాహార్తిని తీర్చుకుని సేద తీరుతున్నట్లు తెలుస్తోంది. బీట్ ఆఫీసర్ శ్రీదేవి ఈ పులిని ప్రత్యక్షంగా చూశారని తెలిసింది.


