News March 10, 2025

JGTL: మిస్సింగ్ అయిన మహిళ మృతి

image

మిస్సింగ్ అయిన ఓ మహిళ మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్‌లో లభ్యమైంది. మాల్యాల ఎస్ఐ నరేశ్ కుమార్ కథనం మేరకు.. ఓబులాపూర్ గ్రామానికి చెందిన జైసేట్టి వెంకవ్వ(50) ఈ నెల 6న రాత్రి 11 గంటల నుంచి కనిపించకుండా పోయిందని భర్త గంగన్న ఫిర్యాదు చేశాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆదివారం జగిత్యాల మండలం అంతర్గాం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్‌లో వెంకవ్వ మృతి చెంది కనిపించింది.

Similar News

News April 1, 2026

సిరిసిల్ల: నెల రోజుల పాటు పోలీసు యాక్ట్‌ అమలు

image

సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు పోలీసు యాక్ట్‌-1861 అమలులో ఉంటుందని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News April 1, 2026

దేవరపల్లి: స్కూటీనీ ఢీకొట్టి కారు..!

image

దేవరపల్లి(M) గౌరీపట్నం పరిధిలోని కొండగూడెం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న స్కూటీని గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురికి గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా, యువకులు సోలార్ సిస్టమ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం.

News April 1, 2026

ఇక మూడు ముక్కలాట ఆడలేరు: ఎంపీ రమేష్

image

పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి ఇకపై అమరావతి రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడలేరని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. జగన్ ఊసరవెల్లి రాజకీయాలు పనిచేయవని పేర్కొన్నారు. లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు ప్రవేశ పెట్టడంతో ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరిందని అన్నారు. అమరావతి రాజధానిని ప్రధాని మోదీ ప్రారంభించాలన్నారు.