News March 10, 2025
కృష్ణా: 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు

మల్లవల్లి పారిశ్రామిక వాడలో 405 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు భారీగా రానున్నాయి. ప్రత్యక్షంగా 30వేల మందికి, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 45వేల మందికి ఉద్యోగ అవకాశాలు త్వరలో రానున్నాయి. ఒకప్పుడు పల్లెటూరిగా ఉన్న మల్లవల్లి ఇప్పుడు వేగంగా ఓ పట్టణంగా మారబోతుంది.
Similar News
News March 10, 2025
బాపులపాడులో అధిక ఉష్ణోగ్రతలు.. తగ్గని వేడి.!

కృష్ణా జిల్లా గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో నేడు బయట ఎండ తీవ్రత కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గలేదు. బాపులపాడు, ఉంగుటూరు మండలాల్లో 35 డిగ్రీలు, గన్నవరంలో 36 డిగ్రీలు నమోదయ్యాయి. పైగా గాలిలేని వాతావరణం ఉక్కపోతను మరింత పెంచింది. “గాలి లేక అసలే ఉమ్మటేసింది!” అని స్థానికులు అంటున్నారు.
News March 10, 2025
గన్నవరం: వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా

విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో వంశీ బెయిల్ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది సత్యవర్ధన్ కౌంటర్ దాఖలుకు రెండు రోజులు సమయం కోరారు. దీంతో విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఏ71గా వల్లభనేని వంశీ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి.
News March 10, 2025
కృష్ణా జిల్లాలో రాత్రి గస్తీ కట్టుదిట్టం

కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపీఎస్ ఆదేశాలతో ఆదివారం రాత్రి గస్తీ పటిష్ఠంగా కొనసాగుతోంది. నేర నియంత్రణ, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు అనుమానిత వాహనాలు, ప్రయాణికుల తనిఖీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టారు. హైవేలపై డ్రైవర్లకు అవగాహన కల్పించి, బస్టాండ్లు, లాడ్జిలలో కొత్త వారి వివరాలు సేకరిస్తున్నారు.