News March 10, 2025
NGKL: చికిత్స పొందుతూ మహిళ మృతి

ఈ నెల 7న రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ మహిళ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. పోలీసుల వివరాలు.. NGKL మండలం వనపట్లకు చెందిన అనూష(32) బైక్‌పై వస్తుండగా.. కొల్లాపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రగాయాలు కాగా.. HYDలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News January 25, 2026
WGL: ఆశావహుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తుల స్వీకరణ!

మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల నుంచి కాంగ్రెస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకులు, కార్యకర్తలు ఆదివారం నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా దరఖాస్తుల స్వీకరించనున్నారు. నేటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు పార్టీ పెద్దల వద్దకు పరుగులు తీయనున్నారు.
News January 25, 2026
GNT: పెళ్లి పేరుతో ఘరనా మోసం.. రూ.5 లక్షలతో వధువు పరార్!

తాడేపల్లి మండలం పెనుమాకలో పెళ్లి పేరుతో మోసం వెలుగుచూసింది. శ్యామల అనే హిజ్రా, విజయలక్ష్మీ అనే మహిళను నల్గొండకు చెందిన దివ్యాంగుడు సందీప్ రెడ్డికిచ్చి వివాహం జరిపించారు. కొన్నాళ్లకే తల్లికి బాగోలేదని చెప్పి, రూ. 5 లక్షల నగదు, బంగారంతో వధువు, శ్యామల కలిసి ఉడాయించారు. ఆరా తీయగా ఆమెకు ముందే పెళ్లయిందని తేలింది. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్యామల గతంలోనూ ఇలాంటి మోసాలు చేసినట్లు సమాచారం.
News January 25, 2026
త్వరలో తిరుపతిలో క్యారవాన్ బస్సులు

పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యారవాన్ బస్సులు తిరుపతికి రానున్నాయి. తిరుపతి సహా జిల్లాలో ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించే దిశగా చర్యలు అధికారులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి కొన్ని ట్రావెల్ యాజమాన్యాలతో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ చర్చలు ఫలించి ఒప్పందం కుదిరితే త్వరలో తిరుపతిలో క్యారవాన్ బస్సులు తిరుగనున్నాయి.


