News March 10, 2025

నల్గొండ: శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఇదే తొలిసారి!

image

తెలంగాణ రాష్ట్రంలో శాసనమండలిలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఏర్పడ్డ ఎమ్మెల్సీ స్థానాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీపీఐ పార్టీకి ఒక స్థానాన్ని కేటాయించింది. అందులో భాగంగా సీపీఐ నుంచి నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గలగూడెంకు చెందిన యాదవ సామాజికవర్గం నెల్లికంటి సత్యం పేరును ప్రకటించింది.

Similar News

News March 10, 2025

పాకిస్థాన్‌లో ఆడినా టీమ్ ఇండియానే విజేత అయ్యుండేది: అక్రమ్

image

అన్ని జట్లూ పాక్‌లో ఆడితే, భారత్ మాత్రం దుబాయ్‌లో ఆడి అన్యాయంగా గెలిచిందంటూ పాక్ అభిమానులు చేస్తున్న ఆరోపణల్ని ఆ దేశ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ కొట్టిపారేశారు. ‘ఈ భారత జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా కప్ కచ్చితంగా గెలిచి ఉండేది. వారు పాక్ వచ్చి ఆడినా గెలిచేవారు. టీ20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలను ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచారు. భారత్‌కున్న క్రికెట్ బలానికి అదే నిదర్శనం’ అని కొనియాడారు.

News March 10, 2025

కోర్టులో జడ్జి ముందు ఒక్కసారిగా విలపించిన నటి!

image

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కెంపెగౌడ విమానాశ్రయంలో దొరికిపోయిన నటి రన్యారావు కోర్టులో ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. న్యాయమూర్తి ముందు కన్నీరు పెట్టుకున్నారు. కస్టడీలో అధికారులు తనను మానసికంగా హింసించారని, దుర్భాషలాడారని ఆరోపించారు. మరోవైపు విచారణకు రన్య సహకరించడం లేదని కోర్టుకు DRI వెల్లడించింది. హింసించారన్న ఆమె ఆరోపణ అవాస్తవమని పేర్కొంది.

News March 10, 2025

రేపు SRM యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు

image

AP: అమరావతి నీరుకొండలోని SRM యూనివర్సిటీకి సీఎం చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్‌మెంట్ అనే వర్క్‌షాప్‌లో సా.4.30 గంటలకు సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీ ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా SRMలోని పలు భవనాలను సీఎం ప్రారంభిస్తారు.

error: Content is protected !!