News March 10, 2025

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు: పెమ్మసాని

image

గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదివారం ప్రకటించారు. PPP మోడల్‌లో ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అందులో భాగంగా గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించి, స్థల సేకరణ, ఎలక్ట్రికల్ వాహనాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించటం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 1, 2026

గుంటూరు: పన్ను వసూళ్లలో GMC రికార్డ్

image

గుంటూరు నగరపాలక సంస్థ 90%కి పైగా పన్ను వసూళ్లతో రికార్డు సృష్టించింది. గతేడాది రూ.152.14 కోట్లు వసూళ్లు రాగా.. ఈ ఏడాది మాత్రం రూ.155.20 కోట్లు రాబట్టినట్లు కమిషనర్ కే.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరిరోజు రూ.9 కోట్ల వసూళ్లతో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.

News April 1, 2026

గుంటూరు: నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్..!

image

నేటి నుంచి జిల్లాలో NTR వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అడిగినా స్పందన కరవైందంది. పాత బకాయిలివ్వకుండా 2017 రేట్లతోనే కొత్త హెల్త్ స్కీం తేవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రుల మనుగడ కష్టంగా మారిందని, తమ ఆందోళనకు ప్రజలు మద్దతివ్వాలని ఆషా కోరింది.