News March 10, 2025

సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం.. 12 మందికి గాయాలు

image

సత్తుపల్లి మండలంలో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి శివారులోని తామర చెరువు వద్ద కాకర్లపల్లి నుంచి వెళుతున్న కూలీల ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 12 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2025

ఖమ్మం: రైల్వే బోర్డు ఛైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ

image

ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రవిచంద్ర రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు.. కొత్త ప్లాట్ ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు వంటి అంశాలపై వివరించారు.

News March 10, 2025

ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి పర్యటన

image

వైరా, నేలకొండపల్లి మండలాల్లో మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ రాఘవ ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా మంత్రి వైరా (M) పుణ్యాపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం నేలకొండపల్లి (M) మేడేపల్లి, అనసాగరం, సదాశివాపురం, నాచేపల్లి, చెర్వుమాదారం, అమ్మగూడెం, రాజేశ్వరపురం తదితర గ్రామాల్లో పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు.

News March 10, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

error: Content is protected !!