News March 10, 2025
పార్వతీపురం: 372 మంది విద్యార్థులు గైర్హాజరు

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 372 గైర్హాజరు అయినట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా సోమవారం 34 పరీక్ష కేంద్రాల్లో 7,880 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 7,508 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 4,954 మంది జనరల్ విద్యార్థులకు గాను 4,812 మంది విద్యార్థులు హాజరుయ్యారు. 2,926 ఒకేషనల్ విద్యార్థులకు గాను 2,696 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Similar News
News March 10, 2025
కడప: మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల

వైవీయూ ఎమ్మెస్సీ పస్ట్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను ప్రిన్సిపల్ ప్రొ. ఎస్.రఘునాథరెడ్డి, కులసచివులు ప్రొ పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కెఎస్వీ కృష్ణారావు, డీన్ ఎ.జి.దాముతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
News March 10, 2025
‘ప్లాస్టిక్ రహిత జిల్లాగా పార్వతీపురంను మారుద్దాం’

జిల్లాలో ప్లాస్టిక్‌ను, చెత్తను పూర్తిగా నిషేధిస్తూ ప్లాస్టిక్ రహిత జిల్లాగా పార్వతీపురంను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాలు, పంచాయతీల్లో దీనిపై ఒక తీర్మానం చేసి అమలు చేయాలని అన్నారు. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు బోర్డులు, ఫ్లెక్సిలను ఏర్పాటుచేయాలని సూచించారు.
News March 10, 2025
ఖమ్మం: రైల్వే బోర్డు ఛైర్మన్‌తో ఎంపీ వద్దిరాజు భేటీ

ఖమ్మం జిల్లాకు సంబంధించిన పలు పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, ఇతర సమస్యలపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సోమవారం రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని రైల్ నిలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ రవిచంద్ర రైల్వే సమస్యలను ప్రస్తావించారు. స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు.. కొత్త ప్లాట్ ఫామ్‌లను విస్తరించడం, కోవిడ్‌కు ముందు రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ, అదనపు హాల్టింగ్‌లు వంటి అంశాలపై వివరించారు.