News March 10, 2025

‘మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందాం’

image

వికారాబాద్ జిల్లా తాండూరు పరిధి యాలాల్ మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల 9 నెలల బాబు వశిష్ఠ ‘బైలేరియా అట్రే సై’ అనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చికిత్సకు రూ.22 లక్షలు అవసరమని చెప్పడంతో <<15707873>>దాతల కోసం<<>> తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. కాగా మన వికారాబాద్ బిడ్డను బతికించుకుందామని ఇప్పటికే కాంగ్రెస్ నేత బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.

Similar News

News September 15, 2025

భారత రత్నం మోక్షగుండం

image

దేశం గర్వించే ఇంజినీర్లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉంటారు. 1908లో HYDలో మూసీ పొంగి 15వేల మంది మరణిస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి వరద నివారణకు కృషి చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్‌గా వరద గేట్లు తెరిచే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ విధానమే అమలులో ఉంది. ఆయన సేవలకు భారత రత్నతో సత్కరించిన కేంద్రం ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తోంది.

News September 15, 2025

భద్రాద్రి జిల్లాకు చేరిన బతుకమ్మ చీరలు

image

భద్రాద్రి జిల్లాకు చేరిన చీరలను అశ్వారావుపేట, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలంలో ఆరు గోదాంలలో భద్రపరుస్తున్నామని డీఆర్డీవో విద్యాచందన తెలిపారు. ఇప్పటి వరకు 40శాతం జిల్లాకు చేరాయి. బతుకమ్మ నాటికి ఇండెంట్ పెట్టినవన్నీ వస్తే ఒక్కొక్కరికి రెండు చీరలు అందిస్తాము. లేకుంటే ఒక్కోటి పంపిణీ చేసి, తర్వాత మళ్లీ అందిస్తామన్నారు.

News September 15, 2025

VJA: వాట్సాప్‌లో కనకదుర్గమ్మ ఆర్జిత సేవల టికెట్లు

image

విజయవాడలో ఈ నెల 22 నుంచి OCT 2 వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ఆర్జిత సేవల టికెట్లను EO శీనానాయక్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. https://kanakadurgamma.org/en-in/home, ప్రభుత్వ వాట్సప్ సేవల నంబర్ 9552300009లో ఈ టికెట్లు కొనుగోలు చేయవచ్చన్నారు. ఉత్సవాలకు హాజరుకాలేని వారు ఆన్‌లైన్‌లో ఆర్జితసేవలు చేయించుకునేందుకు రూ.1,500 చెల్లించి వీడియో లింక్ ద్వారా పూజలను వీక్షించవచ్చన్నారు.