News March 10, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. వ్యూస్‌లో రికార్డు

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ (INDvsNZ) జియో హాట్‌స్టార్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన మ్యాచుగా రికార్డు నెలకొల్పింది. మ్యాచ్ ముగిసే సమయానికి హాట్‌స్టార్‌లో వ్యూస్ సంఖ్య 90.1కోట్లకు చేరింది. పోటాపోటీగా సాగిన మ్యాచును వీక్షించేందుకు క్రీడాభిమానులు అమితాసక్తి కనబరిచారు. దీంతో INDvsAUS సెమీ ఫైనల్ మ్యాచ్ వ్యూస్‌ను (66 కోట్లు) ఫైనల్ అధిగమించింది. గత నెల 23న జరిగిన INDvsPAK మ్యాచుకు 60.2కోట్ల వ్యూస్ వచ్చాయి.
Similar News
News March 10, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉన్న VFX పనులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.
News March 10, 2025
రిటైర్మెంట్ వార్తలు.. స్పందించిన జడేజా

వన్డేలకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖండించారు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న రూమర్స్ నమ్మవద్దని అభిమానులను కోరాడు. థాంక్స్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో తదుపరి వరల్డ్ కప్ వరకు జడ్డూ భారత జట్టుకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.
News March 10, 2025
కేటీఆర్ అందుకే కేసుల గురించి భయపడరు: సీఎం రేవంత్

KTR అధికారం పోయిన బాధలో ఏదేదో మాట్లాడుతున్నారని CM రేవంత్ అభిప్రాయపడ్డారు. ‘KTR నా స్టేటస్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. అసలు కేటీఆర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? క్రిమినల్స్ కేసులకు భయపడరు. భయం ఉంటే నేరమే చేయరు. KTR కూడా అంతే. అందుకే కేసులకు భయపడను అంటున్నారు. MLC ఎన్నికల్లో BRS పోటీ చేయకుండా తప్పించుకుంది. హరీశ్ రావు లాంటివాళ్లు ఆ ఎన్నికల్లో దొంగ దెబ్బ తీశారు’ అని పేర్కొన్నారు.