News March 10, 2025

యాదగిరిగుట్టకు చేరుకున్న గవర్నర్ విష్ణు దేవ్ వర్మ

image

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో 10వ రోజు కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు యాదగిరిగుట్టకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ వచ్చారు. ఆలయ ఈవో భాస్కర్ రావు ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ గొప్పతనాన్ని ఈవో భాస్కరరావు, గవర్నర్ విష్ణు దేవ్ వర్మకు వివరించారు. మరికాసేపట్లో పూర్ణా హుతిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు.

Similar News

News March 15, 2026

డాక్టర్ గోరంట్లకు నారా భువనేశ్వరి ఘన సత్కారం

image

NTR ట్రస్ట్, GSR మెడికల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో డా.గోరంట్ల రవిరాం కిరణ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని NTR ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. HYDలోని టీడీపీభవన్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. భువనేశ్వరి ఆహ్వానం మేరకు వెళ్లిన డాక్టర్ గోరంట్లను ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. పేదలకు అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలని కోరారు.

News March 15, 2026

దుబాయ్‌లోనే ఉంటాం: విదేశీయులు

image

యుద్ధంలో దుబాయ్ నష్టపోతున్నా అక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆ దేశంపై నమ్మకం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ దుబాయ్‌పై 300 మిస్సైళ్లు, 1,567 డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 90% ఆయుధాలను UAE అడ్డుకుంది. అయితే వాటి శిథిలాలు జనావాసాలు, వ్యాపార భవంతులపై పడ్డాయి. దుబాయ్ పాలకులపై నమ్మకం ఉందని, వారు తమను రక్షిస్తున్నారని ఇతర దేశస్థులు చెప్పారు. దుబాయ్ చాలా సురక్షితమైన నగరమని, వదిలే ఉద్దేశం లేదని తెలిపారు.

News March 15, 2026

జగిత్యాల: వీడియో లీక్ చేస్తాం.. ASIకి సైబర్ వల

image

సైబర్ మోసగాళ్లు పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASIకి గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి అతని వీడియోను రికార్డు చేశారు. అనంతరం దానిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ASI మూడు విడతల్లో రూ.95,500 వారి ఖాతాకు పంపించాడు.