News March 10, 2025

జడేజా భార్యపై ప్రశంసలు!

image

న్యూజిలాండ్‌ను టీమ్ఇండియా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం జట్టుతో కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. నెట్టింట ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News March 10, 2025

ICC ఛాంపియన్స్ ట్రోఫీ టీం.. రోహిత్‌కు దక్కని చోటు

image

CT-2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ICC ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. కెప్టెన్‌గా సాంట్నర్(NZ)ను తీసుకుంది. IND నుంచి కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, షమీ, వరుణ్, అక్షర్ పటేల్(12వ ప్లేయర్)లకు చోటిచ్చింది. రచిన్, ఇబ్రహీం, ఫిలిప్స్, అజ్మతుల్లా, హెన్రీలను మిగతా సభ్యులుగా చేర్చింది. అయితే తన కెప్టెన్సీతో INDను ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

News March 10, 2025

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణాలు రాష్ట్ర అప్పులు కావు: కేంద్రం

image

అమరావతి కోసం తీసుకున్న రుణాలు AP అప్పుల పరిధిలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో YCP MP అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ‘ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.6,700 కోట్ల చొప్పున రుణం వచ్చేలా సహాయం చేశాం. ఇవి రాష్ట్ర అప్పులు కావు. రాజధానిలో మౌలిక వసతుల కోసం రూ.2,500 కోట్లు సమకూర్చాం. కౌంటర్ పార్ట్ ఫండింగ్ ద్వారా గరిష్ఠంగా రూ.1500 కోట్లు సమకూర్చాలని నిర్ణయించాం’ అని పేర్కొంది.

News March 10, 2025

ప్రధాని మోదీని కలిసిన ఈటల

image

TG: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఈటల మనవడిని ముద్దు చేసిన మోదీ చాక్లెట్లు అందించారు. కుటుంబ సమేతంగా మోదీతో గడిపిన క్షణాలకు సంబంధించిన ఫొటోలను Xలో ఈటల పంచుకున్నారు. ప్రధానితో చాలా విలువైన సమయం గడిపానని, తన జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికీ మర్చిపోనని రాసుకొచ్చారు.

error: Content is protected !!