News March 10, 2025
ఇక నుంచి ‘కొమురవెళ్లి పుణ్యక్షేత్రం’ రైల్వే స్టేషన్

మనోహరాబాద్- కొత్తపల్లి నుంచి హైదరాబాద్ వరకు వేస్తున్న కొత్త రైల్వే పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయ రైల్వే జంక్షన్‌కు ‘కొమురవెల్లి పుణ్యక్షేత్రం’ అని నామకరణం చేసింది. ఈ మేరకు రైల్వే శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో మరో మూడు స్టేషన్‌లు గుర్రాలగొంది, చిన్నలింగపూర్, సిరిసిల్ల పేర్లను లిస్టులో పెట్టారు.
Similar News
News February 26, 2026
ADB: 369 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈఓ జాదవ్ గణేష్ తెలిపారు. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని వెల్లడించారు. మొత్తం 8,549 మంది విద్యార్థులకు గాను 8,180 మంది హాజరయ్యారని, 369 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
News February 26, 2026
‘వెలుగుమట్ల’ భూముల వివాదం.. హిస్టరీ ఇదే

TG: 1950sలో ఆచార్య వినోబా భావే ఆశయాలకు ఆకర్షితులైన రాయల కోటేశ్వరరావు అనే భూస్వామి ఖమ్మం(D) వెలుగుమట్లలో 62 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకు అప్పగించారు. కాలక్రమంలో విలువ పెరగడంతో అక్రమార్కులు తప్పుడు పత్రాలతో ఆ భూమి అమ్మారు. సొంతింటి కలతో సామాన్యులు కొని ఇళ్లు కట్టుకున్నారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని స్టే విధించింది. దీంతో అధికారులు <<19224009>>నిర్మాణాలను<<>> తొలగిస్తున్నారు.
News February 26, 2026
కామారెడ్డి: 145 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 7,878 మంది విద్యార్థులకు గాను 7,733 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. జిల్లాలో 98.16 శాతం హాజరు నమోదైనట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.


