News March 10, 2025
WGL: క్విటా మొక్కజొన్న ధర రూ.2,305

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మక్కలు(బిల్టీ) క్వింటాకు రూ.2,305 ధర పలికింది. గతవారం రూ.2,400కు పైగా పలికిన మొక్కజొన్న ధర ఈవారం తగ్గడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. అలాగే చాలా రోజుల తర్వాత ఈరోజు మార్కెట్‌కు కొత్త పసుపు తరలిరాగా.. రూ.7,607 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోల్లు-అమ్మకాల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.
Similar News
News March 21, 2026
మొక్కజొన్నకు రూ.2,400 మద్దతు ధర: కలెక్టర్

మొక్కజొన్నకు క్వింటాకు రూ.2,400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ సత్య శారద తెలిపారు. రైతులు పంటను విక్రయించేటప్పుడు తేమ శాతం (మాయిశ్చర్) 14 లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని కోరారు. రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు జమ అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.
News March 21, 2026
WGL: నాలుగు మండలాల్లోనే వర్షం

వరంగల్ జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షపాతం సగటున 0.9 మిల్లీమీటర్లు నమోదుకగా, జిల్లా వ్యాప్తంగా 4.9 మిల్లీమీటర్లు వర్ష పాతం నమోదైంది. జిల్లాలోని 13 మండలాల్లో సంగేంలో 1.8 మిల్లీమీటర్లు, కిలా వరంగల్‌లో 1.5 మిల్లీమీటర్లు, వరంగల్‌లో 0.8 మిల్లీమీటర్లు, గీసుకొండలో 0.8 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదుకగా, మిగిలిన 9 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
News March 20, 2026
WGL: ‘ఈనెల 23న ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు’

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈనెల23న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో 7వ,8వ,9వ తరగతుల విద్యార్థులు రూపొందించిన ఆర్ట్, క్రాఫ్ట్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఇందులో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి, విజేతలకు బహుమతులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములై సృజనాత్మకతను ప్రదర్శించాలన్నారు.


