News March 10, 2025
WGL: ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ

వరంగల్ జిల్లాలోని పలు చోట్ల నేడు పొగమంచు కమ్ముకుంది. ఈ క్రమంలోనే నెక్కొండ మండలంలో ఈరోజు తెల్లవారుజామున పొలం పనులకు, స్కూళ్లకు, అవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు. అలాగే మధ్యాహ్నం సమయంలో భానుడు సైతం తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడని, ఎండ దంచి కొడుతుందని ప్రజలు తెలుపుతున్నారు. మండలంలో విచిత్ర వాతావరణం నెలకొంటుందని చెబుతున్నారు.
Similar News
News March 10, 2025
శ్రీ సత్యసాయి జిల్లాలో 140 మంది గైర్హాజరు.!

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెట్-2 ప్రశ్నాపత్రంతో పరీక్షలు నిర్వహించినట్లు డీఐఈఓ రఘునాథ రెడ్డి సోమవారం తెలిపారు. పరీక్షలకు జనరల్ విద్యార్థులు 6339 మందికి గానూ.. 6236మంది, ఒకేషనల్ విద్యార్థులు 1144 మందికి గానూ 1107 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 140 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయన్నారు.
News March 10, 2025
కేంద్రమంత్రి నాలిక అదుపులో పెట్టుకోవాలి: సీఎం స్టాలిన్

కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ‘ధర్మేంద్ర తనను తాను రాజు అనుకుంటున్నారు. ఆయన నాలిక అదుపులో పెట్టుకోవాలి. ‘పీఎం శ్రీ’ పథకాన్ని మేమెప్పుడూ ఒప్పుకోలేదు. కానీ మేం ఒప్పుకుని మాట మార్చామంటూ ఆయన అవాస్తవాలు చెబుతున్నారు. మీరు తమిళనాడు విద్యార్థులకు ఇవ్వాల్సిన నిధుల్ని ఇస్తారా లేదా ముందు అది చెప్పండి’ అని ప్రశ్నించారు.
News March 10, 2025
రవిచంద్ర నామినేషన్‌లో ఎమ్మెల్యేలు

ఎమ్మెల్యే కోటా శాసనమండలి సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో ఆయన వెంట ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ, కావ్యా కృష్ణారెడ్డి ఉన్నారు.