News March 10, 2025
మిర్యాలగూడ: కోర్టు తీర్పు.. పేరెంట్స్, అమృత భావోద్వేగం

మిర్యాలగూడ <<15710555>>ప్రణయ్ హత్య<<>> కేసులో కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 సుభాష్ శర్మకు ఉరిశిక్ష, A3 అజ్గర్ అలీ, A4 అబ్దుల్లా బారీ, A5 కరీం, A6 శ్రావణ్, A7 శివ, A8 నిజాంకు యావజ్జీవ శిక్షను కోర్టు విధించింది. కాగా కోర్టు తీర్పు అనంతరం మిర్యాలగూడలోని ప్రణయ్ సమాధి వద్ద పూలు వేసి పలువురు నివాళులర్పించారు. ప్రణయ్ తల్లిదండ్రులు, భార్య అమృత కన్నీటి పర్యంతమయ్యారు.
Similar News
News March 10, 2025
NZB: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని నూతన సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
News March 10, 2025
శ్రీకాకుళం: ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి: రామ్మోహన్

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద్ సోనోవాల్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం లేఖ రాశారు. శ్రీకాకుళంలో 197 కి.మీ సముద్ర తీరం ఉండి, 230కి పైగా గ్రామాల ప్రజలు మత్య్స సంపదపై ఆధార పడి జీవిస్తున్నారన్నారు. సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామంలో మత్య్స నౌకాశ్రమం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
News March 10, 2025
ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులందరితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్‌పై మండలస్థాయిలో సమావేశాలు నిర్వహించి, మార్చ్ 31 వరకే రాయితీ వర్తిస్తుందన్నారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్ చేసి రాయితీని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.