News March 10, 2025
కలెక్టర్ క్రాంతిని కలిసిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లా నూతన ఎస్పీగా పరితోష్ పంకజ్ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని ఎస్పీ కలిశారు. ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకై కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News January 10, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 10, 2026
స్టార్ట్ కాకముందే విమర్శలా.. దీపిందర్ ఫైర్!

బ్రెయిన్ మ్యాపింగ్ డివైజ్ ‘టెంపుల్’పై వస్తున్న విమర్శలను జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ ఖండించారు. ఈ పరికరం ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, మార్కెట్లోకి రాకముందే దీనిని వాడొద్దని వైద్యులు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. దీని వెనకున్న శాస్త్రీయ ఆధారాలను వెల్లడిస్తామని, అప్పటివరకు స్టార్టప్‌ల ప్రయత్నాలను ప్రోత్సహించాలని కోరారు. విమర్శలు చేసే ముందు వాస్తవాల కోసం వేచి చూడాలని ఆయన సూచించారు.
News January 10, 2026
ఉమ్మడి జిల్లా ఖోఖో క్రీడాకారుల ఎంపిక పూర్తి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన సబ్ జూనియర్ ఖోఖో క్రీడాకారుల ఎంపికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది బాలబాలికలు హాజరైనట్లు జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా ప్రాబబుల్స్ కోసం 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.


