News March 10, 2025
BIG BREAKING: నిలిచిపోయిన X సేవలు

ప్రపంచ వ్యాప్తంగా X(ట్విటర్) సేవలు నిలిచిపోయాయి. సైట్ ఓపెన్ కాకపోవడంతో యూజర్లంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకౌంట్లోకి లాగిన్ కాలేక, లాగిన్ అయినా యాక్సిస్ చేయలేక అసౌకర్యానికి లోనవుతున్నారు. దాదాపు అరగంట నుంచి ట్విటర్ పనిచేయడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మీకూ సేవలు నిలిచిపోయాయా? కామెంట్ చేయండి. దీనిపై సదరు సంస్థ ఇంకా స్పందించలేదు.
Similar News
News March 10, 2025
జడేజా ‘పుష్ప-2’ సెలబ్రేషన్

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్‌ను టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా రిపీట్ చేశారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం బ్యాట్‌తో వీపుపై తన పేరును చూపించిన ఆయన, అదే ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పక్కన అల్లు అర్జున్ ఫొటో జత చేసి ‘జాతీయ ఆటగాడు అనుకుంటివా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
News March 10, 2025
నటుడు పోసానికి బెయిల్ మంజూరు

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. నరసరావుపేట జిల్లా కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇద్దరు జామీన్, రూ.10వేల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు పోసానిని ఆదేశించింది. చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదుతో గతేడాది నవంబర్‌లో నరసరావుపేట 2టౌన్ పీఎస్‌లో పోసానిపై కేసు నమోదైంది. అయితే మిగతా కేసుల్లో బెయిల్ లభించకపోవడంతో ఆయన బయటకొచ్చే అవకాశం లేదు.
News March 10, 2025
ఆ సినిమా చూడలేక మధ్యలోనే వెళ్లిపోయాం: కిరణ్ అబ్బవరం

మార్కో సినిమాలో హింసను భరించలేకపోయామని యువ నటుడు కిరణ్ అబ్బవరం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా భార్యతో కలిసి ఆ సినిమాకు వెళ్లాను. తను గర్భంతో ఉంది. సెకండ్ హాఫ్ సమయానికి చూడలేకపోయాం. ఆమె చాలా అసౌకర్యాన్ని ఫీలైంది. దీంతో ఇంకా చాలా సినిమా ఉండగానే బయటికొచ్చేశాం’ అని పేర్కొన్నారు. మలయాళ చరిత్రలో అత్యంత హింసాత్మక సినిమాగా పేరొందిన మార్కోకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రావడం గమనార్హం.