News March 10, 2025
NZB: సీపీగా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయి చైతన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ను ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో సీపీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన కల్మేశ్వర్ హైదరాబాద్‌కు బదిలీ కాగా, కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐదు నెలల అనంతరం జిల్లాకు నూతన పోలీస్ బాస్ వచ్చారు.
Similar News
News March 10, 2025
NZB: కలెక్టర్‌ను కలిసిన నూతన సీపీ

నిజామాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన పి.సాయి చైతన్య సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. నూతన సీపీని కలెక్టర్ స్వాగతిస్తూ, అభినందనలు తెలిపారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి మంత్రులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సీపీ పాల్గొన్నారు.
News March 10, 2025
NZB: అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని నూతన సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా, గంజాయి, మట్కా నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
News March 10, 2025
NZB: జిల్లా పంచాయతీ అధికారిగా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారిగా డి.శ్రీనివాస్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి జిల్లా డీపీఓగా ఉన్న ఈయనను ప్రభుత్వం ఇటీవల నిజామాబాద్‌కు బదిలీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ కార్యాలయం సిబ్బంది కొత్త డీపీఓకు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాస్ రావు జిల్లా కలెక్టర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.