News March 10, 2025

చట్ట పరిధిలో సమస్యల పరిష్కరించాలి: ఎస్పీ

image

పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డుడి చెప్పారు. సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 89 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఎస్పీ నేరుగా అర్జీలను స్వీకరించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News March 22, 2026

ఈ IPL సీజన్ గిల్‌కు మంచి అవకాశం: పుజారా

image

IPL-2026లో శుభ్‌మన్ గిల్ చెలరేగి ఆడితే భారత T20 జట్టులో తిరిగి స్థానం పొందే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. ‘గిల్ క్వాలిటీ ప్లేయర్. T20 WC జట్టులో చోటు దక్కకపోవడం అతడిలో కసిని పెంచి ఉంటుంది. ఈ IPL సీజన్ మంచి అవకాశం. 150-160SRతో బ్యాటింగ్ చేయగలనని నిరూపించుకోవాలి. ఈ టైమ్‌లో అతడిపై ఒత్తిడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. IPLలో గుజరాత్ టైటాన్స్‌కు గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

News March 22, 2026

చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.190, మాంసం 300 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.310 నుంచి రూ.320 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 66 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News March 22, 2026

నాగాయలంక మత్స్యకార బిడ్డ.. అంతర్జాతీయ ఖ్యాతి!

image

కృష్ణా (D) నాగాయలంకకు చెందిన మత్స్యకార బిడ్డ నాగిడి గాయత్రి క్రీడా రంగంలో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోంది. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన ‘ఇంటర్నేషనల్ కోర్సెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్’ను ఆమె పూర్తి చేసింది. శనివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ కోచ్‌ల చేతుల మీదుగా ఆమె సర్టిఫికెట్, అవార్డు అందుకున్నారు. గాయత్రి ప్రతిభను గుర్తించిన గ్రామస్థులు, కోచ్‌లు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.