News March 10, 2025
జగిత్యాల ప్రజావాణిలో 50 ఫిర్యాదులు

జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 50 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్. లత, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Similar News
News March 15, 2026
వారిద్దరినీ వదులుకొని KKR తప్పు చేసింది: కుంబ్లే

KKR 2024లో మూడోసారి IPL ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్, ఫిల్ సాల్ట్‌లది కీలక పాత్ర అని మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే చెప్పారు. అలాంటి వాళ్లను వదులుకోవడం కోల్‌కతా చేసిన మిస్టేక్ అని అభిప్రాయపడ్డారు. కీలక ప్లేయర్లను తమ వద్దే ఉంచుకోవడం ఎంత ముఖ్యమన్నది జట్టు అర్థం చేసుకోవాలని సూచించారు. లేదంటే టైటిల్ పోటీలో నిలవలేదని హెచ్చరించారు. కాగా ప్రస్తుతం శ్రేయస్ PBKS, సాల్ట్ RCBలో చేరిన విషయం తెలిసిందే.
News March 15, 2026
విజయవాడలో ధరల సెగ.. కేజీ చికెన్ ఎంతంటే!

ఆదివారం సెలవు దినం కావడంతో విజయవాడలో మాంసం మార్కెట్లు కళకళలాడుతున్నాయి. అయితే ధరలు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. చికెన్ స్కిన్‌లెస్ కిలో రూ. 340 పలుకుతుండగా, మటన్ రూ. 900 వద్ద కొనసాగుతోంది. చేపలు, గుడ్ల ధరలు కూడా నిలకడగా ఉన్నాయి. ప్రాంతాలను బట్టి స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 15, 2026
వరంగల్: కొత్త మోసాలు.. ప్రజలకు పోలీసుల ALERT

ఫోన్ కాల్స్ ద్వారా “డిజిటల్ అరెస్ట్” చేస్తామంటూ బెదిరించే ముఠాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వరంగల్ పోలీసులు హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధులు, రిటైర్డ్ వ్యక్తులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. చట్టంలో “డిజిటల్ అరెస్ట్” అనే పదమే లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా బెదిరించి డబ్బులు అడిగితే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.


