News March 10, 2025

బాపట్ల పీజీఆర్‌ఎస్‌కు 89 అర్జీలు

image

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో 89 అర్జీలు అందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిర్యాదులను చట్టపరిధిలో వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో ప్రజలు స్వయంగా వచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు.

Similar News

News March 16, 2026

గుంటూరు: మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ఏదీ?

image

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘం నాయకులు PGRSలో వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400 ఉండగా, ప్రైవేటు వ్యాపారులు కేవలం రూ.1,600కే కొనుగోలు చేస్తున్నారని వారు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల రైతులు ఎకరాకు రూ.24 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులను ఆదుకోవాలన్నారు.

News March 16, 2026

HNK: గ్రామాల్లో వంద శాతం పన్నుల వసూలు చేపట్టాలి: కలెక్టర్

image

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీలలో పన్నుల వసూళ్లను వేగవంతం చేసి వంద శాతం సేకరించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. గ్రామాల్లో చాటింపులు నిర్వహించి ప్రజలకు పన్నుల వసూలపై అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.

News March 16, 2026

అందుబాటులో ఉండండి.. కార్యదర్శులకు కలెక్టర్ ఆదేశం

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు రోజూ ఉదయం 9:30లోపు విధులకు హాజరై, ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా అపరిశుభ్రత లేకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా చూడాలని ఆమె సూచించారు.