News March 10, 2025

లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి దిగ్భ్రాంతి

image

పల్నాడు జిల్లా క్రోసూరులో విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతిపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. లైన్‌మెన్ రామారావు మృతి బాధ కలిగించిందన్నారు. బాధితుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు.

Similar News

News July 7, 2025

మళ్లీ బుల్లితెరపైకి స్మృతి.. ఫస్ట్ లుక్ విడుదల

image

కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి టీవీ అభిమానులను అలరించనున్నారు. ‘క్యూంకి సాస్ భి కభీ బహు థి’ సీజన్-2లో ఆమె ఫస్ట్ లుక్‌ తాజాగా విడుదలైంది. 25ఏళ్ల తర్వాత ఈ షోలో ‘తులసి విరానీ’ పాత్రలో కనిపించనున్నారు. గతంలోనూ ఆమె ఇందులో నటించారు. ఆపై పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కేంద్రమంత్రి అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైబోలో తెలంగాణ(2011) మూవీలోనూ స్మృతి నటించారు.

News July 7, 2025

నేను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌ను: రాణా

image

ఢిల్లీలో NIA కస్టడీలో ఉన్న ముంబై పేలుళ్ల ఘటన సూత్రధారి తహవూర్ <<16245394>>రాణా <<>>సంచలన విషయాలు వెల్లడించాడు. తాను పాక్ ట్రస్టెడ్ ఏజెంట్‌నని, లష్కరే తోయిబా సంస్థలో శిక్షణ పొందినట్లు చెప్పాడు. ముంబైలోని పలు ప్రముఖ ప్రాంతాలను పరిశీలించి పాక్ ISIతో కలిసి పేలుళ్లకు ప్లాన్ చేశానన్నాడు. అంతకుముందు గల్ఫ్ వార్ సమయంలో పాక్ ఆర్మీ తనను సౌదీకి పంపిందన్నాడు. కాగా రాణాను US నుంచి తీసుకొచ్చి విచారిస్తున్న విషయం తెలిసిందే.

News July 7, 2025

గుంటూరు మిర్చి యార్డులో నేటి ధరలివే.!

image

గుంటూరు మిరప మార్కెట్‌లో సోమవారం 20 వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఏ/సీ సరుకు సంఖ్య 60 వేలుగా నమోదైంది. తాజా ధరల ప్రకారం తేజా ఏ/సి రూ.120-132, 355 ఏ/సి రూ.100-125, 2043 ఏ/సి రూ.120-130, 341 ఏ/సి రూ.120-135, నంబర్ 5 ఏ/సి రూ.125-135 ఉండగా, సీజెంటా, డీడీ, రోమి-26, బంగారం రకాల ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. నాటు 334, సూపర్ టెన్ రకాలు రూ.80-130 వరకు ఉన్నాయి. తాలుకూ ధరలు రూ.35-70 మధ్య ఉన్నాయి.