News March 10, 2025

బెస్ట్ ఫీల్డర్ ఇతనే.. జాంటీ రోడ్స్ రిప్లై!

image

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్ ఎవరనే ప్రశ్నే వస్తే అందరూ దక్షిణాఫ్రికా లెజెండ్ జాంటీ రోడ్స్ పేరు చెప్తుంటారు. అలాంటి ఫీల్డర్‌ను సైతం NZ ప్లేయర్ ఫిలిప్స్ మెప్పించారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గిల్ కొట్టిన బంతిని ఫిలిప్స్ పక్షిలా ఎగిరి క్యాచ్ పట్టిన తీరు అద్భుతం అని, ఈ జనరేషన్‌లో బెస్ట్ ఫీల్డర్ ఇతనేనంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. తానూ అంగీకరిస్తున్నానని జాంటీ రోడ్స్ రిప్లై ఇచ్చారు.

Similar News

News January 30, 2026

ఇన్‌స్టాగ్రామ్‌కు విరాట్ కోహ్లీ గుడ్ బై?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీయాక్టివేట్ అయినట్లు తెలుస్తోంది. ఆయన అకౌంట్‌లో యూజర్ నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఫ్యాన్స్ SMలో పోస్ట్ చేస్తున్నారు. అకౌంట్ టెంపరరీగా డీయాక్టివేట్ అయిందా? లేదా కోహ్లీనే చేసి ఇన్‌స్టాకి గుడ్ బై చెప్పారా అనేది తెలియాల్సి ఉంది. ఆయనకు ఇన్‌స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

News January 30, 2026

ఊపిరితిత్తులు లేకుండా 48 గంటలు బతికాడు!

image

ఓ 33 ఏళ్ల వ్యక్తి లంగ్స్ లేకుండా 48hrs బతికాడు. చికాగో నార్త్‌వెస్టర్న్ వర్సిటీ వైద్యులు ఆర్టిఫిషియల్ లంగ్ సిస్టమ్‌‌ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ గుండెకి రక్త ప్రసరణ చేయడంతో ఇది సాధ్యమైంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌ వల్ల రోగి లంగ్స్‌ పూర్తిగా పాడవడంతో డాక్టర్లు వాటిని తొలగించారు. 48hrs తర్వాత డోనర్ దొరకడంతో విజయవంతంగా డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు Med జర్నల్‌ పేర్కొంది.

News January 30, 2026

3 భాషల్లో ‘ధురంధర్’ స్ట్రీమింగ్

image

సూపర్ హిట్ మూవీ ‘ధురంధర్’ Netflixలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో హిందీలో మాత్రమే రిలీజైన ఈ మూవీ OTTలో తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ వెర్షన్ రన్ టైమ్ 3.34hrs ఉండగా OTTలో 3.25hrsకి తగ్గించారు. 2025 DEC 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1350Cr+ వసూలు చేసింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. INDలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమా ఇదే.