News March 10, 2025
ములుగు జిల్లాకు రేపు గవర్నర్ రాక!

ములుగు జిల్లాలో రేపు (మంగళవారం)రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటించనున్నారు. తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని ఇటీవల గవర్నర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. కాగా గ్రామంలో పలు రకాల అభివృద్ధి పనులను అధికారులు చేపట్టారు. గ్రామపంచాయతీ, రోడ్లు, గ్రామాభివృద్ధికి సంబంధించి వివిధ రకాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. ఆ పనులను పరిశీలించేందుకు వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News March 31, 2026
మెదక్: ఉద్యోగ విరమణ రోజే ఎస్పీగా పదోన్నతి

మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ ఉద్యోగ విరమణ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు మహేందర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ రోజు పదోన్నతి పొందడం ఆనందంగా ఉందన్నారు. శేష జీవితం ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు.
News March 31, 2026
NGKL: ‘ఇంటింటికీ ఇంకుడు గుంత తప్పనిసరి’

వేసవి దృష్ట్యా భూగర్భ జలాల సంరక్షణకు ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా భూగర్భ జల అధికారిణి దివ్య జ్యోతి సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి మళ్లించి, నీటిని పొదుపుగా వాడాలని కోరారు. రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పాండ్స్ నిర్మించుకోవాలని, భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆమె పేర్కొన్నారు.
News March 31, 2026
భీమవరం: బడ్జెట్ కేటాయింపులపై చర్చ

భీమవరం కలెక్టరేట్‌లో ‘బడ్జెట్ ఔట్‌రీచ్’ సమీక్షలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి పాల్గొన్నారు. జిల్లాలో ప్రధానమైన వ్యవసాయం, ఆక్వా రంగాలతో పాటు ఇతర రంగాల విస్తరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ సందర్భంగా సూచించారు. బడ్జెట్ ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.


