News March 10, 2025
వరంగల్: సింగల్ పట్టి మిర్చి రూ. 39వేలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి సోమవారం అరుదైన మిర్చి ఉత్పత్తులు తరలి రాగా ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.17వేలు పలకగా,1048 రకం మిర్చి రూ.11వేలు, 5531 రకం మిర్చికి రూ. 11,300 ధర వచ్చింది. అలాగే ఎల్లో మిర్చికి రూ.20 వేలు, టమాటా మిర్చికి రూ.28వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.39వేల ధర వచ్చినట్లు వ్యాపారులు పేర్కొన్నారు.
Similar News
News March 7, 2026
WGL: నేటి నుంచి ‘హెచ్‌పీవీ’ టీకాలు

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత టీకా(HPV) పంపిణీ జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభమైంది. 15 ఏళ్లలోపు బాలికల కోసం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రితో పాటు వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీఎంహెచ్‌వో సాంబశివరావు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈ టీకా కోసం 9,824 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.
News March 7, 2026
WGL: పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ నుంచి తెలంగాణ అధ్యక్షురాలిగా..!

వర్ధన్నపేటకు చెందిన స్వర్ణకు కాంగ్రెస్‌లో 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. 1991లో PACS ఛైర్‌పర్సన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 2005లో వరంగల్ నగర మేయర్‌గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 నుంచి 2025 వరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పని చేశారు. స్వర్ణ నియామకంతో ఓరుగల్లు రాజకీయాల్లో సమీకరణాలు మారనున్నాయి. వర్ధన్నపేట, వరంగల్ తూర్పులో రాజకీయం మరింత వేడెక్కనుంది.
News March 7, 2026
ఆర్టీసీ ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలు: ఆర్ఎం

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు వరంగల్ RM విజయభాను తెలిపారు. హనుమకొండ ఆర్టీసీ రీజియన్ కార్యాలయంలో తలంబ్రాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునే భక్తులు రూ.151 చెల్లించి టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని సూచించారు.


