News March 10, 2025

రిటైర్మెంట్ వార్తలు.. స్పందించిన జడేజా

image

వన్డేలకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖండించారు. తన రిటైర్మెంట్‌పై వస్తున్న రూమర్స్ నమ్మవద్దని అభిమానులను కోరాడు. థాంక్స్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు. దీంతో తదుపరి వరల్డ్ కప్ వరకు జడ్డూ భారత జట్టుకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 11, 2025

ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

image

TG: హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News March 11, 2025

బండి సంజయ్ జోక్యంతో భారతీయులకు విముక్తి

image

థాయ్‌లాండ్‌లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్‌కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.

News March 11, 2025

విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సంగక్కర శతకం బాదారు. అతడు 47 బంతుల్లోనే 106 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంగక్కర విధ్వంసంతో 147 రన్స్ టార్గెట్‌ను లంక 12.5 బంతుల్లోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ వాట్సన్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే.

error: Content is protected !!