News March 10, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉన్న VFX పనులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.
Similar News
News March 11, 2025
ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
News March 11, 2025
బండి సంజయ్ జోక్యంతో భారతీయులకు విముక్తి

థాయ్‌లాండ్‌లో బందీలుగా మారిన 540 మంది భారతీయులకు విముక్తి లభించింది. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో 540 మందిని సైబర్ నేరగాళ్లు బందీలుగా చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో బాధితులకు విముక్తి లభించగా, ప్రత్యేక విమానంలో వారంతా భారత్‌కు చేరుకున్నారు. బాధితుల్లో ఏపీ, తెలంగాణకు చెందిన యువత అధికంగా ఉన్నారు.
News March 11, 2025
విధ్వంసం.. 47 బంతుల్లో సెంచరీ

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో సెంచరీల మోత మోగుతోంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్ సంగక్కర శతకం బాదారు. అతడు 47 బంతుల్లోనే 106 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచారు. ఇందులో 19 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. సంగక్కర విధ్వంసంతో 147 రన్స్ టార్గెట్‌ను లంక 12.5 బంతుల్లోనే ఛేదించింది. కాగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ వాట్సన్ మూడు శతకాలు బాదిన విషయం తెలిసిందే.