News March 10, 2025
సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఫొటోస్ వైరల్

ఎమ్మెల్యే జగ్గారెడ్డి జీవిత చరిత్రపై సినిమా రానుంది. ఇప్పటివరకు రాజకీయ నాయకుడిగా కనిపించిన జగ్గారెడ్డి సినిమాలో నటించే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. జగ్గారెడ్డి ‘ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ రూపకల్పన జరుగుతుందన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. జగ్గారెడ్డి చరిత్రపై సినిమా రానుడంతో ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా రేంజ్‌లో రానుంది.
Similar News
News March 11, 2025
బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రి కుర్రాడి విజయం

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో మందమర్రికి చెందిన అక్షయ్ విజేతగా నిలిచారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 100 మందికి పైగా పోటీలో పాల్గొన్నారు. అక్షయ్ 70 విభాగంలో తన ప్రతిభ చాటి మొదటి బహుమతి కైవసం చేసుకున్నారు. పట్టణవాసులు పలువురు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
News March 11, 2025
భద్రాద్రి: ఏఐ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో నడుస్తున్న విద్యాబోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించుకోవాలని కోరారు.
News March 11, 2025
భద్రాచలం: పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో ఇద్దరికి రిమాండ్

భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ ఛాంబర్ ఎదుట ఈనెల 4న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర వ్యక్తులను ఆరా తీయడం ద్వారా పట్టణానికి చెందిన భాను, నరేశ్‌లే ఈ చర్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.