News March 10, 2025

ఏలూరు: ఆర్జీల ఫిర్యాదుల పరిష్కారానికి కృషి: ఎస్పీ

image

ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ కిషోర్ తెలిపారు. 40 రోజుల ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక తిరిగి పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అనేక ఫిర్యాదులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుదారులు అందించారు. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ ప్రతాప్ సింగ్ చేశారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 11, 2025

‘X’పై భారీ ఎత్తున సైబర్ ఎటాక్: మస్క్

image

కొన్ని గంటలుగా X(ట్విటర్) మొరాయించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. Xపై పెద్ద ఎత్తున సైబర్ దాడి జరుగుతోందని ట్వీట్ చేశారు. ప్రతి రోజు ఇది జరుగుతోందన్నారు. దీని వెనుక ఒక గ్రూప్ లేదా ఏదైనా దేశం ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడికి ఎవరు పాల్పడుతున్నారనేది ట్రేస్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 11, 2025

హైడ్రా ప్రజావాణికి వినతులు వెల్లువ

image

హైడ్రా సోమవారం ప్ర‌జావాణిని నిర్వ‌హించింది. ప్ర‌జావాణికి మొత్తం 63 ఫిర్యాదులందాయని అధికారులు తెలిపారు. పాత‌ లేఔట్లు, ర‌హ‌దారులు, పార్కులు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కాపాడాల‌ని ప‌లువురు వినతులు అందజేశారు. మున్సిప‌ల్ మాజీ కౌన్సిల‌ర్లు, వార్డు మెంబ‌ర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌బ్జా చేస్తున్నార‌ని వారిపై ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల నుంచి స్పంద‌న లేద‌ని ప‌లువురు వాపోయారు.

News March 11, 2025

KMR: మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్

image

రబీ పంటలకు సాగు నీటి సరఫరాపై మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్‌లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!