News March 10, 2025

అనకాపల్లి: ప్రజా వేదికలో 440 అర్జీలు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఆమె సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులకు పంపించారు. మొత్తం 440 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.

Similar News

News March 11, 2025

భద్రాద్రి: ఏఐ తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన విద్యార్థులకు వరంగా మారనుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వీ.పాటిల్ అన్నారు. సోమవారం బూర్గంపాడు మండలం అంజనాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో ఏఐతో నడుస్తున్న విద్యాబోధన తరగతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు కంప్యూటర్ ల్యాబ్‌ను వినియోగించుకోవాలని కోరారు.

News March 11, 2025

భద్రాచలం: పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటనలో ఇద్దరికి రిమాండ్‌

image

భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.రామకృష్ణ ఛాంబర్‌ ఎదుట ఈనెల 4న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఇతర వ్యక్తులను ఆరా తీయడం ద్వారా పట్టణానికి చెందిన భాను, నరేశ్‌లే ఈ చర్యకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఆదివారం రాత్రి వీరిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

News March 11, 2025

విజయవంతంగా ముగిసిన LRS అవగాహన సెమినార్

image

ఖమ్మం జిల్లాలో LRSపై ఏర్పాటు చేసిన అవగాహన సెమినార్ విజయవంతంగా ముగిసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎం. రవీందర్ రావు తెలిపారు. సోమవారం ఖమ్మం జెడ్పీ సమావేశ మందిరంలో LRSపై అవగాహన సెమినార్‌ను నిర్వహించారు. LRSపై సభ్యులు అడిగిన వివిధ సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేశామని చెప్పారు. LRSకు సంబంధించి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచే సినట్లు జిల్లా రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

error: Content is protected !!