News March 10, 2025
అర్జీల పరిష్కారంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని కలెక్టరేట్లో ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి 152 అర్జీలు స్వీకరించారు. అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
Similar News
News November 12, 2025
మదనపల్లి కిడ్నీ రాకెట్.. నిందితులపై కేసు

APలో సంచలనం సృష్టించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఆసుపత్రి యజమాని డా.ఆంజనేయులు, మరో వైద్యుడితో పాటు బ్రోకర్లు పద్మ, సత్యలపై మానవ అవయవాల అక్రమ రవాణా కేసు ఫైల్ చేశారు. యమున అనే మహిళ మిస్సింగ్ కేసుతో కిడ్నీ రాకెట్ బయటపడింది. పద్మ, సత్య డబ్బు ఆశ చూపి అమాయకులను కిడ్నీ మార్పిడి దందాలోకి దింపుతున్నారు. యమునను కూడా తీసుకొచ్చి కిడ్నీ తొలగిస్తుండగా మరణించింది.
News November 12, 2025
SRCL: డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్‌ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
News November 12, 2025
సిరిసిల్ల: ‘రైతు బజార్‌లోనే విక్రయాలు జరగాలి’

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్‌లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్‌ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.


