News March 10, 2025
రామగుండం ఎయిర్‌పోర్ట్ సాధ్యం కాదు: కేంద్రం

TG: పెద్దపల్లి(D) రామగుండంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని స్థానిక MP గడ్డం వంశీ చేసిన ప్రతిపాదనలపై కేంద్రం స్పందించింది. ‘ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు సాధ్యం కాదు. చుట్టూ కొండలు, ఎయిర్‌స్పేస్‌పై IAF ఆంక్షలు ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదు. ఒక వేళ ప్రభుత్వం నుంచి వస్తే పరిశీలిస్తాం’ అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు MPకి రిప్లై ఇచ్చారు.
Similar News
News March 11, 2025
‘ది రాజాసాబ్’లో నా రోల్ అది కాదు: నిధి అగర్వాల్

ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ చిత్రంలో తాను దెయ్యం పాత్ర పోషించట్లేదని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. ఈ సినిమాలో తన రోల్ వినోదాత్మకంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు. హీరో ప్రభాస్ సెట్‌లో అందరితో సరదాగా నవ్విస్తూ ఉంటారని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలోనూ నటిస్తున్నారు.
News March 11, 2025
ఆ కారు ఉత్పత్తిని ఆపేయనున్న మారుతీ?

తమ సెడాన్ కారు సియాజ్ ఉత్పత్తిని ఇకపై ఆపేయాలని మారుతీ సుజుకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆ కారును సంస్థ తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సియాజ్‌కు ఆదరణ బాగా తగ్గింది. ఈ ఏడాది కేవలం 7726 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మరోవైపు పోటీ సంస్థల నుంచి సిటీ, విర్చస్, స్లేవియా, వెర్నా వంటి కార్లు దూసుకెళ్తుండటంతో సియాజ్ ఉత్పత్తిని ఇక నిలిపేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.
News March 11, 2025
మార్చి 10: చరిత్రలో ఈ రోజు

*1689: ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మరణం
*1915: టీమిండియా మాజీ క్రికెటర్ విజయ్ హజారే జననం
*1922: తెలుగు సినిమా నేపథ్య గాయకుడు మాధవపెద్ది సత్యం జననం
*1955: పెన్సిలిన్ సృష్టికర్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరణం
*1979: తెలుగు సాహితీకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మరణం