News March 10, 2025

అస్సాంకు సొంత ఉపగ్రహం

image

త్వరలో ‘అస్సాంశాట్’ అనే సొంత ఉపగ్రహాన్ని లాంఛ్ చేయనున్నట్లు అస్సాం ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ ప్రకటించారు. సరిహద్దులపై నిఘాకు, కీలక సామాజిక-ఆర్థిక ప్రాజెక్టులపై సమాచారం కోసం ఈ శాటిలైట్‌ను వాడనున్నట్లు పేర్కొన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, విపత్తు నిర్వహణ, వ్యవసాయానికి కూడా అది ఉపకరిస్తుందని వివరించారు. ప్రయోగం పూర్తైతే సొంత శాటిలైట్ ఉన్న తొలి రాష్ట్రంగా అస్సాం నిలవనుంది.

Similar News

News March 28, 2026

లిల్లీ మొక్కల్లో ఆకుమచ్చ తెగులు – నివారణ

image

లిల్లీ సాగులో ఆకుమచ్చ తెగులు శిలీంధ్రాల వల్ల వస్తుంది. దీని వల్ల ఆకులపై నీటిలో నానినట్లు ఉండే మచ్చలు చిన్న చిన్నవిగా ఏర్పడి, అవి క్రమంగా గోధుమ రంగులోకి మారతాయి. తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోయి మొక్క మొత్తం మాడిపోయినట్లు కనిపిస్తుంది. పూల దిగుబడి పడిపోతుంది. దీని నివారణకు లీటరు నీటికి హెక్సాకొనజోల్ 2ml లేదా ప్రొపికొనజోల్ 1ml కలిపి పిచికారీ చేయాలి.

News March 28, 2026

రైతులకు ఐడీ కార్డులు.. ₹215 కోట్లతో ప్రోత్సాహకాలు

image

TG: రాష్ట్రంలో కూరగాయల సాగును పెంచేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యేక ‘కిసాన్ ఐడీ కార్డులు’ జారీ చేయనుంది. వీటి ద్వారా లోన్లు, మార్కెటింగ్ సదుపాయాలు ఈజీగా అందుతాయి. ₹215 కోట్ల బడ్జెట్‌తో పందిళ్లు, యంత్ర పరికరాలపై 50% సబ్సిడీని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 2.50 లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకూ సహకారం అందించనుంది.

News March 28, 2026

వామ్మో.. సగం విమానాల్లో లోపాలు

image

గతేడాది కాలంలో తనిఖీ చేసిన 754 విమానాల్లో ఏకంగా 377 విమానాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు పార్లమెంటరీ కమిటీ గుర్తించింది. ముఖ్యంగా ఎయిరిండియా, ఇండిగో విమానాల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2025 జూన్‌లో జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత చేపట్టిన ఆడిట్‌లో ఈ నిజాలు బయటపడ్డాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.