News March 10, 2025
నంద్యాల జిల్లాలో TODAY TOP NEWS

☞ ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్ ☞ ఉయ్యాలవాడలో కొడుకు చేతిలో తల్లి దారుణ హత్య ☞ వైసీపీ పాలనతో విద్యార్థులకు తీవ్రనష్టం: ఎంపీ శబరి ☞ వైసీపీ వాళ్లే ‘ఆడుదాం ఆంధ్ర’ ఆడారు: అఖిలప్రియ ☞ మహానందీశ్వరుని దర్శనానికి వెళ్లొస్తూ యువకుడి దుర్మరణం ☞ గుండ్ల శింగవరంలో కాటసాని ప్రత్యేక పూజలు ☞ కొలిమిగుండ్ల సీఐపై YCP సంచలన ఆరోపణలు ☞ కొనసాగుతున్న గాలికుంటు టీకాల కార్యక్రమం
Similar News
News March 11, 2025
ములుగు: మహిళలకు వడ్డీలు చెల్లించే ప్రక్రియ కొనసాగుతుంది: సీతక్క

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మహిళా సంఘాలకు పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా సంఘాలకు భారం కాకుండా సభ్యురాలి కుటుంబం ఇబ్బందులు పడకుండా రూ.10 లక్షల ప్రమాద భీమా చెల్లిస్తున్నామన్నారు. 400 మంది మహిళలకు రూ.40 కోట్లకు పైగా చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు.
News March 11, 2025
సంగారెడ్డి: ఇద్దరిని సస్పెండ్ చేసిన కలెక్టర్

ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించిన 17 మంది మున్సిపల్ సిబ్బందికి నోటీసులు, ఇద్దరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో జహీరాబాద్ ఆర్ఐ సంజీవ్, సదాశివపేట మేనేజర్ ఉపేందర్ సింగ్, సంగారెడ్డి కమిషనర్ ప్రసాద్ చౌహన్ ఉన్నారు. జహీరాబాద్ సదాశివపేట బిల్ కలెక్టర్లు అహ్మద్, శ్రీకాంత్‌లను సస్పెండ్ చేశారు.
News March 11, 2025
HYD: సైబర్ క్రైం.. రూ.36 లక్షలు ఇప్పించారు

హైదరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగిపై డిజిటల్ అరెస్ట్ సైబర్ నేరగాళ్లు జరిపారు. ఫెడక్స్ కొరియర్ డ్రగ్స్ పేరుతో 43లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడు డబ్బును ఫ్రీజ్ చేసి 36లక్షల రూపాయలను బాధితుడికి డీడీ ద్వారా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత అందజేశారు.