News March 10, 2025
జడేజా ‘పుష్ప-2’ సెలబ్రేషన్

పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా.. ఇంటర్నేషనల్ అంటూ ఆ మూవీలో డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్‌ను టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా రిపీట్ చేశారు. నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం బ్యాట్‌తో వీపుపై తన పేరును చూపించిన ఆయన, అదే ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. పక్కన అల్లు అర్జున్ ఫొటో జత చేసి ‘జాతీయ ఆటగాడు అనుకుంటివా..’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోను బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
Similar News
News March 11, 2025
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అవార్డు

TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ విమానాశ్రయం ఈ అవార్డుకు ఎంపికైంది. 2024కు గానూ ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15-25 మిలియన్ల ప్రయాణికులకు రాకపోకలు అందించి బెస్ట్ విమానాశ్రయంగా నిలిచింది. విమానాశ్రయ పరిణామం, సిబ్బంది తీరు, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు.
News March 11, 2025
నటితో గిల్ డేటింగ్?

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, టీవీ నటి అవ్‌నీత్ కౌర్ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌కు ఆమె హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో గిల్, అవ్‌నీత్ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అవ్‌నీత్ కౌర్ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
News March 11, 2025
అనుమానాస్పద స్థితిలో కొరియన్ సింగర్ మృతి

దక్షిణ కొరియా పాప్ సింగర్ వీసంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సియోల్‌లోని ఆయన నివాసంలో శవమై కనిపించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా గుండెపోటుతో మరణించినట్లు వీసంగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఇన్సోమ్నియా, హార్ట్‌సోర్ స్టోరీ వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.