News March 10, 2025

7:36 వరకూ ఇండియన్స్ మేల్కోరట.. మరి మీరు?

image

కొందరు భారతీయులు ఉదయం 6 గంటలకే మేల్కొంటే మరికొందరు 8 దాటినా బెడ్‌పైనే ఉంటుంటారు. అందరి యావరేజ్ ప్రకారం భారతీయులు 7:36 AMకు నిద్ర లేస్తారని ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ వెల్లడించింది. అందరి కంటే ముందుగా మేల్కొనేది సౌతాఫ్రికా ప్రజలే. వారు 6:24కే నిద్ర లేస్తారు. ఆ తర్వాత కొలంబియా 6:31, కోస్టారికా 6:38, ఇండోనేషియా 6:55, జపాన్ &మెక్సికో 7:09, ఆస్ట్రేలియా 7:13, USAలో 7:20AMకి లేచి పనులు స్టార్ట్ చేస్తారు.

Similar News

News March 11, 2025

నటితో గిల్ డేటింగ్?

image

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, టీవీ నటి అవ్‌నీత్ కౌర్‌ డేటింగ్‌లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌కు ఆమె హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. గతంలో గిల్, అవ్‌నీత్ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అవ్‌నీత్ కౌర్‌ గతంలో ప్రొడ్యూసర్ రాఘవ్ శర్మతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

News March 11, 2025

అనుమానాస్పద స్థితిలో కొరియన్ సింగర్ మృతి

image

దక్షిణ కొరియా పాప్ సింగర్ వీసంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సియోల్‌లోని ఆయన నివాసంలో శవమై కనిపించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా గుండె‌పోటుతో మరణించినట్లు వీసంగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఇన్సోమ్నియా, హార్ట్‌సోర్ స్టోరీ వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.

News March 11, 2025

‘ది రాజాసాబ్’లో నా రోల్ అది కాదు: నిధి అగర్వాల్

image

ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ చిత్రంలో తాను దెయ్యం పాత్ర పోషించట్లేదని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. ఈ సినిమాలో తన రోల్ వినోదాత్మకంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు. హీరో ప్రభాస్ సెట్‌లో అందరితో సరదాగా నవ్విస్తూ ఉంటారని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలోనూ నటిస్తున్నారు.

error: Content is protected !!