News March 10, 2025
మాజీ సీఎం ఇంట్లో IT రైట్స్.. అధికారుల వాహనంపై రాళ్ల దాడి

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ CM భూపేశ్ బఘేల్ ఇంట్లో ED సోదాల సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. బఘేల్, ఆయన కొడుకు చైతన్య నివాసాల్లో రైడ్స్ అనంతరం అధికారుల వాహనంపై INC కార్యకర్తలు రాళ్లు రువ్వారు. అటు తనపై కేసును SC కొట్టేసినా రైడ్స్ చేయడంపై బఘేల్ మండిపడ్డారు. తన ఇంట్లో రూ.33 లక్షల నగదు మాత్రమే దొరికిందని, కానీ పెద్ద సంఖ్యలో క్యాష్ కౌంటింగ్ మెషీన్లు తీసుకొచ్చి ED సెన్‌సేషన్ చేస్తోందన్నారు.
Similar News
News March 11, 2025
అనుమానాస్పద స్థితిలో కొరియన్ సింగర్ మృతి

దక్షిణ కొరియా పాప్ సింగర్ వీసంగ్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. సియోల్‌లోని ఆయన నివాసంలో శవమై కనిపించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడమే కారణమని అనుమానిస్తున్నారు. కాగా గుండెపోటుతో మరణించినట్లు వీసంగ్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. ఇన్సోమ్నియా, హార్ట్‌సోర్ స్టోరీ వంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.
News March 11, 2025
‘ది రాజాసాబ్’లో నా రోల్ అది కాదు: నిధి అగర్వాల్

ప్రభాస్, మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ది రాజాసాబ్’ చిత్రంలో తాను దెయ్యం పాత్ర పోషించట్లేదని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. ఈ సినిమాలో తన రోల్ వినోదాత్మకంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుందన్నారు. హీరో ప్రభాస్ సెట్‌లో అందరితో సరదాగా నవ్విస్తూ ఉంటారని పేర్కొన్నారు. కాగా ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ సినిమాలోనూ నటిస్తున్నారు.
News March 11, 2025
ఆ కారు ఉత్పత్తిని ఆపేయనున్న మారుతీ?

తమ సెడాన్ కారు సియాజ్ ఉత్పత్తిని ఇకపై ఆపేయాలని మారుతీ సుజుకీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 2014లో ఆ కారును సంస్థ తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సియాజ్‌కు ఆదరణ బాగా తగ్గింది. ఈ ఏడాది కేవలం 7726 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మరోవైపు పోటీ సంస్థల నుంచి సిటీ, విర్చస్, స్లేవియా, వెర్నా వంటి కార్లు దూసుకెళ్తుండటంతో సియాజ్ ఉత్పత్తిని ఇక నిలిపేయాలని సంస్థ నిర్ణయించినట్లు సమాచారం.