News March 11, 2025
ఘోరం: పిల్లల్ని చంపి దంపతుల ఆత్మహత్య

TG: హైదరాబాద్‌లోని హబ్సిగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లల్ని చంపి దంపతులు చంద్రశేఖర్(40), కవిత(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 11, 2025
నేడు గ్రూప్-2 ఫలితాలు

TG: నేడు గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించనుంది. 783 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక 1,363 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి ఫలితాలను ఈ నెల 14న విడుదల చేయనుంది. మార్చి 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను రిలీజ్ చేస్తామని టీజీపీఎస్సీ తెలిపింది.
News March 11, 2025
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు

ఏప్రిల్ 2 నుంచి జేఈఈ మెయిన్ తుది విడత పరీక్షలు నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. పేపర్-1 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించనున్నారు. 8న మధ్యాహ్నం విడత మాత్రమే పరీక్ష జరగనుంది. బీఆర్క్ సీట్లకు పేపర్-2ఎ, బి-ప్లానింగ్ సీట్లకు పేపర్-2బి పరీక్షలను ఏప్రిల్ 9న ఉదయం విడతల నిర్వహించనున్నారు. పేపర్-1 ఫలితాలను ఏప్రిల్ 17వరకు వెల్లడిస్తారు.
News March 11, 2025
హీరోకు గాయం.. మరింత ఆలస్యం కానున్న ‘వార్-2’!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘వార్-2’ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశముంది. ఈ చిత్రంలో స్టార్ హీరోల మధ్య ఓ సాంగ్ ప్లాన్ చేయగా తాజాగా రిహార్సల్స్‌లో హృతిక్ గాయపడినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మేలో ఈ పార్ట్ షూట్ చేస్తారని సమాచారం. దీంతో విడుదలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.