News March 11, 2025
ఫైనల్ మ్యాచ్‌లో చాలా టెన్షన్ పడ్డా: KL రాహుల్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమ్ ఇండియా విజయంలో కేఎల్ రాహుల్(34) కీలకంగా వ్యవహరించారు. అయితే ఆడుతున్నప్పుడు తాను చాలా టెన్షన్ పడ్డానని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా తర్వాత మరో ఇద్దరు బ్యాటర్లున్నారు. అయినప్పటికీ టెన్షన్‌తోనే ఉన్నా. కానీ ఆ పరిస్థితుల్లో మైండ్‌ను స్థిరంగా ఉంచుకుని ఏకాగ్రతతో ఆడాలి. మన దేశీయ క్రికెట్‌లో చిన్నతనం నుంచే ఒత్తిడి అలవాటు అవుతుంది. అది హెల్ప్ అయింది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 18, 2026
కావ్యా.. కాల్ చెయ్: లలిత్ మోదీ

పాక్ బౌలర్ అబ్రార్‌ను సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన <<19366541>>వివాదం<<>>లోకి IPL ఫౌండర్ లలిత్ మోదీ ఎంటర్ అయ్యారు. ‘ఫ్యాన్స్ ఆవేశంలో ఉన్న సమయంలో ఒక పాక్ ప్లేయర్‌పై ₹2.34 కోట్లు ఇన్వెస్ట్ చేయడమా? ప్రజాభిప్రాయాన్ని ఎలా మేనేజ్ చేయాలో, సామ్రాజ్యాలను ఎలా నిర్మించాలో నాకు బాగా తెలుసు. నాకు కాల్ చెయ్’ అంటూ పరోక్షంగా SRH ఓనర్ కావ్యా మారన్‌ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు.
News March 18, 2026
₹2.40 లక్షలిస్తాం.. ఇండియాకు వెళ్లిపోండి: US

అక్రమ వలసదారులు తమ దేశం విడిచి వెళ్లాలని US మరోసారి కోరింది. చట్టవిరుద్ధంగా నివసిస్తున్నందుకు వేసిన ఫైన్స్‌ను రద్దు చేయడంతో పాటు ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు అందజేస్తామని పేర్కొంది. అలాగే ₹2,40,329 ఎగ్జిట్ బోనస్ కింద ఇస్తామని తెలిపింది. ఈ క్రమంలో అక్కడి హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ ప్రకటనతో పాటు తాజ్‌మహల్ ఫొటోను పోస్ట్ చేసి ‘Fly to India For Free’ అంటూ రాయడం చర్చనీయాంశమైంది.
News March 18, 2026
జనం సెక్సువల్ కంటెంట్ చూస్తున్నారు: రక్షిత

‘KD: ది డెవిల్’ సినిమాలోని ‘సర్కే చునర్’ పాట అసభ్యంగా ఉందన్న <<19406830>>విమర్శల<<>>పై డైరెక్టర్ ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. గతంలో వచ్చిన ఈ తరహా పాటలకులేని అభ్యంతరం ఇప్పుడెందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం జనం రక్తపాతం, సెక్సువల్ కంటెంట్‌ను చూస్తున్నారని, కేవలం ఒక్క పాటతో తన భర్తను వ్యక్తిగతంగా దూషించడం సరికాదని మండిపడ్డారు. కన్నడ సినిమాలను థియేటర్లకు చేర్చడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలని కోరారు.


