News March 11, 2025
KMR: ప్రజావాణికి 101 ఫిర్యాదులు

కామారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరం వేదికగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. భూముల సమస్యలు, రెండు పడకల గదుల ఇళ్లు మంజూరు, రైతుభరోసా, మున్సిపల్ వార్డుల్లో పారిశుద్ధ్యం తదితర అంశాలపై 101 ఫిర్యాదులు వచ్చాయి. అర్జీలను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News July 5, 2025
బూర్గంపాడు: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన బూర్గంపాడులో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని ముదిరాజ్ వీధికి చెందిన నీరుడు సంధ్య(38) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటుంది. మనస్తాపంతో శుక్రవారం భర్త శేషయ్య పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి చెల్లి లీలావతి ఫిర్యాదు మేరకు SIప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 5, 2025
భేష్.. సిద్దిపేట కలెక్టర్ సేవలు

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఏకంగా 8 గురుకులాలను తనిఖీ చేశారు. ఆయా పాఠశాలలో అందుతున్న వసతులు, మధ్యాహ్న భోజనం, విద్య వంటి తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నేడు కొండపాక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల, మహాత్మ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో సందర్శించారు. బాగా చదువుకోవాని విద్యార్థులకు సూచించారు.
News July 5, 2025
MDCL: వీకెండ్.. ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఇవే..!

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అనేక చోట్ల ప్రకృతి రమణీయత ఉట్టి పడుతుంది. జిల్లాలోని ఈ ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు. కండ్లకోయ ఆక్సిజన్ పార్కు, నారపల్లి నందనవనం, జటాయువు పార్కు, కీసరగుట్ట వనం, నాగారం లంగ్స్ పార్క్, శామీర్పేటలోని జింకల పార్కు, టూరిజం రిసార్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటివలే కురిసిన వర్షాలతో పచ్చదనం మరింత పెరిగింది.