News March 11, 2025
నరసరావుపేట: దూరవిద్య ఇంటర్ పరీక్షలకు 90% హాజరు

పల్నాడు జిల్లాలో దూరవిద్య ఇంటర్మీడియట్ పరీక్షలకు 90 శాతం మంది విద్యార్థులు సోమవారం హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎన్. చంద్రకళ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 9 సెంటర్లలో పరీక్ష నిర్వహించామన్నారు. మొత్తం 1,950 మంది విద్యార్థులకు 1,762 మంది విద్యార్థులు హాజరు అయ్యారని తెలిపారు. నరసరావుపేట సత్తెనపల్లి, వినుకొండ పరీక్షా కేంద్రాలను డీఈవో చంద్రకళ తనిఖీ చేసి, ఏర్పాట్లపై సూచనలు చేశారు.
Similar News
News March 17, 2026
HYD: భారీగా పెరిగిన ధరలు.. అడ్డుకోరా?

వాణిజ్య గ్యాస్ కొరత సాకుతో నగరంలో హోటల్ తిండి హోరెత్తుతోంది. టీ కప్పు నుంచి టిఫిన్ ప్లేట్ దాకా HYDలో ₹5- ₹10 వరకు పెంచేసిన హోటళ్లు.. గ్యాస్ సరఫరా చక్కబడినా ధరలు తగ్గిస్తారన్న గ్యారెంటీ లేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో ధరలు పెరిగినా మళ్లీ కిందికి రాలేదు. ఉదాహరణకి ‘ఆనియన్ సలాడ్’! ఈ భారమంతా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన విద్యార్థులు, మధ్యతరగతి జీవుల మీదే పడుతోందంటున్నారు. ఈ దోపిడీని అడ్డుకోరా?
News March 17, 2026
కొండారెడ్డిపల్లి అభివృద్ధి పనులపై ఫోకస్ పెంచాలి: కలెక్టర్

CM రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం క్షేత్రస్థాయిలో సమీక్షించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, జిల్లా పరిషత్ సీఈవో, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
News March 17, 2026
GWL: కేజీబీవీ లకు కేటాయించిన బడ్జెట్ వినియోగించాలి

కేజీబీవీలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. కేజీబీవీలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అనుమతి లేకుండా ఎవరిని పాఠశాలలోకి అనుమతించరాదన్నారు. విద్యార్థుల సంక్షేమం, భద్రతపై ప్రిన్సిపాళ్లు దృష్టి పెట్టాలన్నారు.


