News March 11, 2025
చిత్తూరు: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 అర్జీలు

చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 167 ఫిర్యాదులు అందినట్టు అధికారులు సోమవారం తెలిపారు. రెవెన్యూ 112, పంచాయతీ రాజ్ ఒకటి, పోలీస్ శాఖ 11, పంచాయతీరాజ్‌కు మూడు ఫిర్యాదులు వచ్చినట్టు వారు వెల్లడించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 1, 2026
చిత్తూరు జిల్లాలో 23 ఉద్యోగాలకు నోటిఫికేషన్

చిత్తూరు జిల్లాలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి కలెక్టర్ సుమిత్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. గ్రేడ్-3 ఏఎన్ఎం-20, ఆఫీస్ సబార్డినేట్-2, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-1 మొత్తంగా 23 పోస్టులను భర్తీ చేస్తారు. 18 ఏళ్లు నిండి 52 ఏళ్ల లోపు ఉన్న దివ్యాంగులు మాత్రమే అర్హులు. ఏప్రిల్ 4వ తేదీ లోపు దరఖాస్తులను చిత్తూరు కలెక్టరేట్‌కు పంపించాలి. వివరాలకు ఇక్కడ <
News April 1, 2026
చిత్తూరు జిల్లాకు రూ.100 కోట్లు

సామాజిక పెన్షన్లను నేడు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఏప్రిల్ నెలకు సంబంధించి 2,33,645 మంది లబ్ధిదారులకు రూ.100.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఉదయం 6.30 నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణవార్డు కార్యాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఇవాళ పెన్షన్ పొందలేని వారికి గురువారం అందిస్తామన్నారు.
News March 31, 2026
ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రమాదాల నివారణపై సమీక్ష నిర్వహించారు. పరిశ్రమలలో అధికారుల సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ప్రమాదాల నివారణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రమాదాలలో ఇతర నిర్మాణాలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.


