News March 11, 2025

ADB: కనిపించకుండా పోయి..శవమై తేలాడు

image

మావలలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. అయితే మావల ఎస్ఐ గౌతమ్ వివరాల మేరకు.. మావలకు చెందిన షేక్ పర్వేజ్ (22) పెట్రోల్ బంక్‌లో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం సమయంలో ఇంటి నుంచి బయలుదేరి.. రాత్రయినా తిరిగి వెళ్లలేదు. సోమవారం ఉదయం మావల ఎర్రకుంట చెరువులో శవమై కనిపించాడు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు సూసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News March 21, 2026

ADB: గ్యాస్ కొరత లేదు.. పుకార్లను నమ్మకండి: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న అసత్య వార్తలను ప్రజలు నమ్మవద్దని ఆయన కోరారు. వినియోగదారులు సిలిండర్లు బుక్ చేసుకుంటే నిర్ణీత గడువులోగా నేరుగా ఇంటికే డెలివరీ చేయబడతాయని, ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. జిల్లాలో సరఫరా వ్యవస్థ సజావుగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.

News March 21, 2026

ఆదిలాబాద్: జనగణన పారదర్శకంగా జరగాలి – కలెక్టర్

image

రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న జనగణన (సెన్సస్-2027) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. స్థానిక టీటీడీసీలో టెక్నికల్ అసిస్టెంట్లు, క్లర్కులకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, ఎక్కడా తప్పులు దొర్లకుండా చూడాలని కలెక్టర్ స్పష్టం చేశారు.