News March 11, 2025

MNCL: సింగరేణిలో పలువురు అధికారులు బదిలీ

image

సింగరేణిలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేకే 5 డిప్యూటీ మేనేజర్ వి.ప్రవీణ్, ఆర్కే ఓసీ మేనేజర్ సుధీర్ జయవంత్ రావు, అడిషనల్ మేనేజర్ క్రిషన్ వినోద్ కుమార్, ఎస్ఈ ప్రశాంత్ జీవన్, శాంతిఖని అడిషనల్ మేనేజర్ గంగాప్రసాద్ రాయ్, ఆర్కే 1ఏ డీవైఎస్ఈ లక్ష్మీనారాయణ, ఎస్ఆర్పీ ఓసీ2 మేనేజర్ బ్రహ్మాజీ రావు, ఆర్కే 5 సీనియర్ అండర్ మేనేజర్ శరత్, ఖైరిగూడ ఓసీ ఎస్ఈ సూర్యనారాయణ బదిలీ అయ్యారు.

Similar News

News March 22, 2026

వరంగల్ మార్కెట్ రేపు పునః ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. నిన్న రంజాన్, ఈరోజు వారాంతపు సెలవు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో రేపు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా, ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News March 22, 2026

గద్వాల: రోడ్డు ప్రమాదం.. మృతులు కర్ణాటక వాసులు

image

బలిగేర శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరికోత పనులు ముగించుకుని బైక్‌పై వెళ్తుండగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొన్నారు. మృతులు దేవునిపల్లికి చెందిన తిమ్మప్ప (35), ఓగులప్ప (40)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 22, 2026

VZM: విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు

image

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగా.. ఇంటర్ పరీక్షలు పూర్తైన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సూచించారు. పరీక్షల అనంతరం ఖాళీ సమయంలో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు వంటి జలవనరుల వద్దకు వెళ్లే అవకాశముండడంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి పిల్లలకు ముందుగానే హెచ్చరికలు ఇవ్వాలని ఆయన కోరారు.