News March 11, 2025
PGRSలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కారం చేయాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కారం చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ అన్నారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల విషయంలో ఎవరు అలసత్వం వహించరాదని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 28, 2026
అమరావతిలో అత్యవసర సేవల లోపం బహిర్గతం

అమరావతిలో అత్యవసర సేవల లోపం బయటపడింది. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాల్లో రూ.19 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఉద్దండరాయునిపాలెంలో మధ్యాహ్నం జరిగిన ఘటనకు ఫైర్ ఇంజన్ 50 నిమిషాల తర్వాత చేరింది. మరో ఘటనలో కూడా స్పందన ఆలస్యం కనిపించింది. సమయానికి సహాయం అందక నష్టం పెరిగిందని విమర్శలు వస్తున్నాయి. రాజధాని అభివృద్ధి జరుగుతున్నా, భద్రతా సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రజలు కోరుతున్నారు.
News March 28, 2026
GNT: ధాన్యం సేకరణ.. రికార్డు దిశగా..!

ఖరీఫ్ సీజన్‌లో మూడు జిల్లాల్లో ధాన్యం సేకరణకు భారీ లక్ష్యాలు నిర్ణయించారు. బాపట్లలో 2 లక్షల టన్నుల లక్ష్యానికి 1.88 లక్షల టన్నులు చేరగా, గుంటూరులో లక్ష టన్నులలో 82 వేల టన్నులు సేకరించారు. మార్కెట్ ధరలు మద్దతు ధర కంటే ఎక్కువగా ఉండటంతో రైతులు లాభపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కువకాలం తెరిచి ఉంచినా లక్ష్యాలకు స్వల్పంగా తగ్గాయి. శనివారంతో సేకరణ కేంద్రాలు మూతపడనున్నాయి.
News March 28, 2026
గుంటూరు: AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ఎస్పీ హెచ్చరిక

AI బయోమెట్రిక్ స్కామ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దని, సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ సెట్టింగ్స్‌లో ఉంచుకోవాలని కోరారు. సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సాంకేతికతతో పొంచి ఉన్న ముప్పును పసిగట్టాలని ఆయన హెచ్చరించారు.


