News March 11, 2025
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బయటకు వెళ్లే వ్యక్తులు హైడ్రేట్‌గా ఉండేలా గొడుగులు, స్కార్ఫ్‌లు ధరించాలని, మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని ఆయన సూచించారు.
Similar News
News September 18, 2025
‘మార్కో’ సీక్వెల్‌కు ఉన్ని ముకుందన్ దూరం!

మలయాళ సూపర్ హిట్ మూవీ ‘మార్కో’కు సీక్వెల్ రానుంది. ‘లార్డ్ మార్కో’గా రానున్న ఈ చిత్రంలో హీరోగా ఉన్ని ముకుందన్ నటించట్లేదని సినీ వర్గాలు తెలిపాయి. వేరే హీరోతో ఈ మూవీని తెరకెక్కిస్తారని పేర్కొన్నాయి. ‘మార్కో’పై వచ్చిన నెగిటివిటీ కారణంగా పార్ట్-2 చేసేందుకు ఆసక్తి లేదని గతంలోనే ఉన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రధాని మోదీ బయోపిక్ ‘మా వందే’లో లీడ్ రోల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
News September 18, 2025
విజయవాడ: రేపటితో ముగియనున్న గడువు.. త్వరపడండి

CRDA ఇంజినీరింగ్ విభాగంలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 50 అసిస్టెంట్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 25 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 15 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, చీఫ్(4), సూపరింటెండింగ్ ఇంజినీర్(8) పోస్టులు భర్తీ చేస్తున్నామని..అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దరఖాస్తు వివరాలకు https://crda.ap.gov.in/ చూడాలన్నారు.
News September 18, 2025
విశాఖలో మెడికో విద్యార్థిని ఆత్మహత్య

మాకవరపాలేనికి చెందిన శివానీ జోత్స్న (21) MBBS సెంకండ్ ఇయర్ చదువుతోంది. ఫస్ట్ ఇయర్లో బ్యాక్‌లాగ్స్ ఉండడంతో వాటిని క్లియర్ చేయలేనేమోనని ఆందోళన చెందింది. ఈ క్రమంలోనే బుధవారం సుజాతానగర్‌లోని తన మేనమామ ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలిచగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.